ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 15, 2021, 5:52 PM IST

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా 119 మంది చిన్నారులు అనాథలుగా గుర్తింపు

కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులకు రాష్ట్రప్రభుత్వం సాయం అందిస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా.... 119 మంది చిన్నారులను గుర్తించినట్లు ఆయా...జిల్లాల కలెక్టర్లు... ప్రభుత్వానికి తెలియచేశారు. వీరికి 10 లక్షల చొప్పున బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది.

రాష్ట్రవ్యాప్తంగా 119 మంది చిన్నారులు అనాథలుగా గుర్తింపు
రాష్ట్రవ్యాప్తంగా 119 మంది చిన్నారులు అనాథలుగా గుర్తింపు

రాష్ట్రంలో కొవిడ్ కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయి 119 మంది చిన్నారులు అనాథలుగా మారినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 16 మంది, నెల్లూరు, విశాఖల్లో 13 మంది చొప్పున చిన్నారులు అమ్మానాన్నల్ని పోగొట్టుకున్నారని పేర్కొంది. శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో 11 మంది చొప్పున, తూర్పుగోదావరిలో 10 మంది, కడప, కర్నూలు జిల్లాల్లో 9 చొప్పున చిన్నారులు అనాథలయ్యారని గుర్తించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో 8 మంది చొప్పున, అనంతపురంలో ఏడుగురు, చిత్తూరు జిల్లాలో నలుగురు బాధితులైనట్లు అధికారులు లెక్కలు తేల్చారు. విజయనగరం జిల్లాలో ఇప్పటివరకూ ఇలాంటి కేసులేవీ ఉత్పన్నం కాలేదని వైద్యారోగ్యశాఖ స్పష్టంచేసింది. ఇప్పటి వరకు అనాథలుగా మారిన 84 మంది పిల్లల పేరిట 10 లక్షల చొప్పున డిపాజిట్ చేసినట్టు ప్రభుత్వం తెలియజేసింది.

ABOUT THE AUTHOR

...view details