CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,179 కరోనా కేసులు.. 11 మరణాలు - రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గణాంకాలు
16:43 September 21
corona cases: రాష్ట్రంలో కొత్తగా 1,179 కరోనా కేసులు, 11 మరణాలు
రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో1,179 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 42,737 నిర్ధారణ పరీక్షలు చేశారు. జిల్లాల వారీగా తూర్పుగోదావరిలో 192, చిత్తూరులో 190, పశ్చిమగోదావరిలో 161, అనంతపురంలో 8, కడపలో 30, గుంటూరులో 107, కృష్ణాలో 167, నెల్లూరులో 131, ప్రకాశంలో 124, శ్రీకాకుళంలో 19, విశాఖలో 47, విజయనగరంలో ఒకరికి కరోనా సోకిందని ప్రభుత్వం తెలిపింది. మొత్తంగా రాష్ట్రంలో 13,905 మంది కరోనా యాక్టివ్ కేసులున్నట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 24 గంటల వ్యవధిలో11 మంది మృతి చెందారు.
దీంతో ఇప్పటివరకూ కరోనా మృతుల సంఖ్య 14,089 కు పెరిగింది. 24 గంటల్లో 1,651 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.
ఇదీ చదవండి : Lokesh: 'ఆ కుటుంబంలో ఏ ఒక్కరి ప్రాణాలకు ప్రమాదం జరిగినా సీఎందే బాధ్యత'