ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పింగళి వెంకయ్యతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్న సుబ్బయ్య - పింగళి వెంకయ్య

Pingali Venkayya village మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంటే చూసిన ప్రతి భారతీయుడి మది పులకరిస్తుంది. మనసు దేశభక్తితో ఉప్పొంగుతుంది. దేశం గుండెలపై ఆ త్రివర్ణ పతాకం ఎగరక ముందే మన తెలుగువాడి మేధస్సున అంకురించింది. పింగళి జ్ఞాపకాల గురించి ఆయన స్వగ్రామానికి చెందిన 110 సంవత్సరాల సుబ్బయ్య చెప్పిన సంగతులపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

pingali venkayya
pingali venkayya

By

Published : Aug 15, 2022, 5:57 PM IST

Pingali Venkayya Village: ఆజాదీకా అమృత్​ మహోత్సవ్​లో భాగంగా... జాతీయ పతాక రూపకర్తగా పింగళి వెంకయ్యకు సముచిత ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త ప్రాచుర్యం కల్పించింది. అంతటి మహోన్నత ఖ్యాతి గడించిన పింగళి వెంకయ్య స్వగ్రామం కృష్ణా జిల్లా చల్లపల్లి మండలంలోని యార్లగడ్డ. పింగళి వెంకయ్య తన 19వ యేట సైన్యంలో చేరి... జపనీస్‌, ఉర్దూ భాషల్లో మంచి పట్టు సాధించారు. అలానే బందరు జాతీయ కళాశాలలో అధ్యాపకులుగా విధులు నిర్వహించారు. ఆయన స్వగ్రామానికి చెందిన సుబ్బయ్య అనే 110ఏళ్ల వృద్ధుడు.. పింగళితో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. వెంకయ్య తన పొలాలకు కూడా వచ్చేవారని.. ఆయన తాత పేరుమీద ఇప్పటికీ సూరయ్య చెరువు ఉందని తెలిపారు.

పింగళి స్వగృహం శిథిలావస్థకు చేరడంతో నాలుగేళ్ల క్రితం పడగొట్టారని గ్రామస్థులు తెలిపారు. ప్రస్తుతం కేవలం ఇంటి పిల్లర్లు మాత్రమే ఉన్నాయన్నారు. దేశం కోసం అప్పటి ఆచారాలు, కట్టుబాట్లను కూడా లెక్కచేయకుండా సేవ చేసిన పింగళి వెంకయ్య.. తమ గ్రామానికే చెందిన వారు కావడం ఎంతో ఆనందంగా ఉందని గ్రామస్థులు అంటున్నారు.

ప్రభుత్వం చొరవ చూపి తమ గ్రామంలో పింగళి విగ్రహం ఏర్పాటు చేయాలని యార్లగడ్డ గ్రామస్థులు కోరుతున్నారు.

పింగళి వెంకయ్యతో సుబ్బయ్య అనుబంధం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details