ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నడిరోడ్డుపైనే.. కరోనా మృతదేహాన్ని వదిలేసిన 108 సిబ్బంది! - కరోనాతో తిరువూరులో వ్యక్తి మృతి వార్తలు

కరోనా కారణంగా మానవత్వం మంటగలిపోతోంది. సాటివారికి సాయం చేయలేని దీన పరిస్థితుల్లో ప్రపంచం కొట్టుమిట్టాడుతోంది. వైరస్​తో చనిపోయారని తెలియగానే.. కనీసం అటువైపు చూడలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. అలాంటి దారుణ పరిస్థితి.. కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. కరోనాతో చనిపోయాడని తెలియగానే 108 సిబ్బంది నడిరోడ్డుపై మృతదేహాన్ని వదిలేసి వెళ్లారు.

నడిరోడ్డుపైనే కరోనా మృతదేహాన్ని వదిలేసిన 108 సిబ్బంది!
నడిరోడ్డుపైనే కరోనా మృతదేహాన్ని వదిలేసిన 108 సిబ్బంది!

By

Published : May 11, 2021, 7:30 PM IST

నడిరోడ్డుపైనే కరోనా మృతదేహాన్ని వదిలేసిన 108 సిబ్బంది!

కరోనాతో మృతి అని తెలియగానే.. మృతదేహాలను ఎక్కడపడితే అక్కడే వదిలేసి వెళ్తున్నారు. అలాంటి ఘటనే కృష్ణా జిల్లా తిరువూరులో జరిగింది. కరోనా మరణం అని తెలిసి నిర్దాక్షిణ్యంగా నడిరోడ్డుపై మృతదేహాన్ని 108 సిబ్బంది వదిలి వెళ్లారు. తిరువూరు మండలం మునుకుళ్ల గ్రామానికి చెందిన షేక్ సుభాని (35) కి కరోనా సోకింది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆసుపత్రికి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు 108కు సమాచారం ఇచ్చారు. మార్గమధ్యంలోనే పరిస్థితి విషమించి కరోనాతో పోరాడి సుభాని మృతి చెందాడు.

108 సిబ్బంది.. ఈ విషయాన్ని గమనించి.. మానవత్వాన్ని మరిచినట్టుగానే ప్రవర్తించారు. నడిరోడ్డు మీద మృతదేహాన్ని వదిలి వెళ్లారు. దాదాపు రెండు గంటల పాటు మృతదేహం రహదారి పక్కనే ఉంది. మృతుడి బంధువుల ఆర్తనాదాలు.. అక్కడి వారిని కలిచి వేశాయి. ఈ విషయం తెలిసిన వెంటనే.. తిరువూరు పట్టణ సీఐ శేఖర్ బాబు, సిబ్బంది ఘటన స్థలానికి వెళ్లారు. సామాజిక సేవకులు సురేష్, ఆదినారాయణ, వాలంటీర్లను తీసుకెళ్లారు. పోలీస్ సిబ్బంది, స్వచ్ఛంద సేవా కార్యకర్తలు కలిసి సుభాని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details