కృష్ణా జిల్లా నందిగామలోని మాగల్లు గ్రామంలో.. ప్రపంచంలోనే ఎత్తైన 108 అడుగుల శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి ఆలయం ఎదుట.. భారీ ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించిన అనంతరం ఆలయంలో విగ్రహాలను ప్రతిష్టించారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ ఈ కార్యక్రమాలు నిర్వహించారు.
ఐదు రోజులుగా జరుగుతున్న ప్రతిష్ట మహోత్సవాలు.. విగ్రహ ప్రతిష్ట, స్వామివారి కల్యాణాలతో ముగిశాయి. శ్రీ లలిత కామేశ్వరి పీఠం స్వామీజీ ఆదిత్యనంద భారతి స్వామి.. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకునేందుకు.. పెద్ద ఎత్తున మహిళలు, భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.