రాష్ట్ర వ్యాప్తంగా 108 అంబులెన్స్ సిబ్బంది.. తమ డిమాండ్లపై బెట్టు వీడడం లేదు. సమస్యలపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమైన పరిస్థితుల్లో.. విజయవాడ ధర్నాచౌక్ వేదికగా ఆందోళన చేశారు. జీవీకే సంస్థ తమకు బకాయి ఉన్న మొత్తాన్ని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. 108 అంబులెన్స్ వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలని, ప్రైవేటు కంపెనీలకు అప్పగించవద్దని కోరారు. తాము విధులు బహిష్కరించినా... ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని... 108 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ కోరారు.
సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోదా?: 108 సిబ్బంది - dharanachowk
ప్రభుత్వంతో చర్చలు విఫలమైన పరిస్థితుల్లో.. 108 ఎమర్జెన్సీ అంబులెన్స్ ఉద్యోగులు విజయవాడ ధర్నాచౌక్ వేదికగా ఆందోళన చేశారు.
108 ఎమర్జెన్సీ అంబులెన్స్ ఉద్యోగుల ఆందోళన