ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

105 సంవత్సరాల వృద్ధుడు మృతి - 105 years old man dead in jaggaiahpeta

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో శతాధిక వృద్ధుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన 105 సంవత్సరాల రోశయ్య కన్నుమూశాడు. అతను ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా సహజ మరణం పొందాడని కుటుంబసభ్యులు తెలిపారు

105 years old man dead in jaggaiahpeta at krishna district
105 సంవత్సరాల శతాధిక వృద్ధుడు మృతి

By

Published : Aug 19, 2020, 8:45 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన శతాధిక వృద్దుడు దాచేపల్లి రోశయ్య(105) ఆగస్టు 18న మృతి చెందారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మనువళ్లు, మనువరాళ్లతో కలిపి 90 మంది వారసులున్నారు. యుక్త వయస్సులో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. రోశయ్య ఎలాంటి అనారోగ్యానికి గురికాలేదు...105 సంవత్సరాల వరకు కూడా తన పనులను తానే చేసుకుని సహజ మరణం పొందాడు.

ABOUT THE AUTHOR

...view details