రాష్ట్రంలో కొత్తగా కొనుగోలు చేసిన అంబులెన్సుల్లో అధికారులు వెంటిలేటర్లు అమర్చుతున్నారు. 104 వాహనాలను ఏఎల్‌ఎస్ (అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్) వాహనాలుగా మార్చుతున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బాధితులను రక్షించడంలో ఈ వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు.
అంతర్జాతీయ వైద్య ఉపకరణాల తయారీ సంస్థ రెస్‌మెడ్ నుంచి ఈ పరికరాలను కొనుగోలు చేశామని అన్నారు. వెంటిలేటర్లతో పాటు గుండె సంబంధిత సమస్యలకు చికిత్స అందించే పరికరాలను సైతం అమర్చుతున్నారు.