కొవిడ్ బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందేలా 104 కాల్ సెంటర్ సిబ్బంది వెంటనే స్పందించాలని రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 104, 108 కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ప్రవీణ్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. కేంద్రానికి వస్తున్న కాల్స్, సిబ్బంది స్పందిస్తున్న తీరు, ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. 104, 108 కమాండ్ కంట్రోల్ పడకలు,ఆస్పత్రిలో చేరడం,ఆక్సిజన్ కోసం ఎన్ని కాల్స్ వస్తున్నాయో ఆయన అడిగి తెలుసుకున్నారు.
104, 108 కమాండ్ కంట్రోల్ కేంద్రం తనిఖీ - today State General Administration Special Secretary praveen kumar news update
రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రవీణ్ కుమార్.. కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 104, 108 కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొవిడ్ బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందేలా 104 కాల్ సెంటర్ సిబ్బంది తక్షణమే స్పందించాలని ఆయన ఆదేశించారు.
104, 108 కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక కార్యదర్శి