గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు అన్నారు. 10వేల32 గ్రామ సచివాలయాలను YSR హెల్త్ క్లినిక్‌లుగా గుర్తించామన్నారు. 8వేల500 హెల్త్ క్లినిక్ భవనాలను నూతనంగా నిర్మిస్తున్నామని తెలిపారు. శిక్షణ తీసుకున్న సిబ్బందిని క్లినిక్‌లలో నియమిస్తామని తెలిపారు. 67 రకాల ఔషధాలను అందుబాటులో ఉంచుతామన్నారు. 14 రకాల వైద్య పరీక్షలు గ్రామ స్థాయిలోనే చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11వందల42 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయన్నారు. అదనంగా 176 పీహెచ్‌సీలు రానున్నాయని, ప్రతి పీహెచ్ సీలో ఇద్దరు వైద్యులను నియమిస్తామన్నారు.
10వేల32 గ్రామ సచివాలయాల్లో YSR హెల్త్ క్లినిక్‌లు - గ్రామ సచివాలయాలను YSR హెల్త్ క్లినిక్‌లుగా గుర్తింపు
గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 10వేల32 గ్రామ సచివాలయాలను YSR హెల్త్ క్లినిక్‌లుగా గుర్తించామని, వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు. శిక్షణ తీసుకున్న సిబ్బందిని క్లినిక్‌లలో నియమిస్తామని ఆయన అన్నారు.
clinics