ప్రవాసీయులను దేశానికి తీసుకొచ్చేందుకు కృష్ణా జిల్లా విజయవాడ విమానాశ్రయం ప్రత్యేక పాత్ర పోషించింది. 'వందే భారత్' మిషన్ ప్రారంభించినప్పటినుంచి ఇప్పటిదాకా..98 విమానాలలో ప్రజలు రాష్ట్రానికి వచ్చారు. ఈరోజు వచ్చే మరో రెండు విమానాలు ... ఎయిర్‌పోర్ట్‌కు చేరనున్నాయి. ఇప్పుడు వాటి సంఖ్యం 100కి చేరనుంది. యూఏఈ, అమెరికా, లండన్, సౌదీ అరేబియా, యూకే, మలేసియా, సింగపూర్, షార్జా, ఖతార్, ఫిలపీన్స్, రాస్ అల్ ఖైమా, దుబాయ్, కువైట్ తదితర దేశాల నుంచి ఇప్పటివరకు 14 వేల మంది ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో ఇంతమంది ప్రయాణికులను సురక్షితంగా తమ స్వస్థలాలకు చేర్చిన ఘనత దేశంలోనే విజయవాడ విమానాశ్రయానికి దక్కుతుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. రాష్ట్రానికి విమానాశ్రయం అవసరతను వందే భారత్ మిషన్ ద్వారా అంచనా వేయగలిగామని వారు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఏరైవల్స్ మాత్రమే విమానాశ్రయం వేదికగా జరిగిన డిపాశ్చర్స్కి అవసరమైన అన్ని వసతులు ఉన్నట్లు చెప్పారు. A320, 737, చార్టెడ్ సర్వీసుల్లో మాత్రమే ప్రయాణికులు రాష్ట్రానికి చేరుకున్నారని.. బోయింగ్ 777 లాంటి విమానాలు వచ్చినా విమానాశ్రయం అనుకూలంగా ఉంటుందని తెలిపారు. వందే భారత్ మిషన్ అంచనాలతో కేంద్ర పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో త్వరలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిస్థాయి అభివృద్ధి సాధిస్తుందని ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ మధుసూదనరావు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆ ఘనత విజయవాడ విమానాశ్రయానిదే..! - Vijayawada International Airport
కరోనా లాక్‌డౌన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి చేర్చే 'వందే భారత్' మిషన్‌లో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం కీలక పాత్ర పోషించిందని విమానాశ్రయ డైరెక్టర్ మధుసూదనరావు తెలిపారు. మిషన్‌లోని నాలుగు దశల్లో భాగంగా మే 20వ తేదీ నుంచి బుధవారం నాటికి... 98 విమానాలు రాగా ఇవాళ రానున్న రెండు సర్వీసులతో ఆ సంఖ్య 100కి చేరనుంది.
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం