ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కూలీల ఆటో బోల్తా...10 మందికి గాయాలు - krishna district

కృష్ణాజిల్లా ఘంటసాల మండలం చిట్టూర్పు వద్ద కూలీల ఆటో బోల్తా పడింది. ఘటనలో పలువురికి గాయాలు కాగా.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

10 members injured in auto accident at ghantasala.in krishna district

By

Published : Aug 3, 2019, 12:57 PM IST

కూలీల ఆటో బోల్తా ...10 మందికి గాయాలు..

కృష్ణాజిల్లా ఘంటసాల పరిధిలోని కూలీల ఆటోబోల్తా పడటంతో పది మందికి గాయాలయ్యాయి. వీరందరూ నాగాయలంక మండలం చోడవరం గ్రామం నుంచి కూలి పనుల కోసం మొవ్వ వెళుతుండగా... చిట్టూర్పు వద్ద ఈ ప్రమాదం జరిగింది. కుక్క అడ్డురావటంతో దాన్ని తప్పించబోయి ఆటో పల్టీ కొట్టినట్లు బాధితులు చెబుతున్నారు. క్షతగాత్రులలో ఇద్దరిని మచిలీపట్నం ఆసుపత్రికి తరలించగా...మిగిలినవారిని చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సంఘటన విషయం తెలుసుకున్న అవనిగడ్డ ఎమ్.ఎల్.ఏ సింహాద్రి రమేష్బాబు బాధితులను పరామర్శించారు.

ABOUT THE AUTHOR

...view details