ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేసిన తాళం వేసినట్టే ఉంది...ఇల్లు గుల్లైంది....! - కృష్ణా జిల్లా

చోరీ చేసే తీరు మారిందా.....? లేక చిన్న చిన్న చోరీలు చేయడం మానేశారా... పక్కా ప్రణాళికతో దొంగతనాలు చేస్తున్న దుండగులను చూస్తుంటే నిజమనిపిస్తుంది. ఎలా అంటారా... ? ఒక చోట.. ఇంటికి, బీరువాకి వేసిన తాళం వేసినట్టే ఉంది.. కానీ 10 లక్షలు దొంగిలించారు. మరో చోట .. బుక్​షాపులో 60 వేల నగదు.... ఇత్తం మొత్తం డబ్బు చాలా సులువుగా కొట్టేశారు .

భారీ చోరీ

By

Published : Jul 11, 2019, 12:21 PM IST

Updated : Jul 13, 2019, 2:28 PM IST

భారీ చోరీ

కృష్ణా జిల్లా కంచికచర్ల వసంత కాలనీలో భారీ చోరీ జరిగింది. జాన్ బాషా అనే వ్యక్తి పొలం కొనడానికి, బ్యాంకు నుంచి 10లక్షలు డ్రా చేసి తన ఇంట్లోని బీరువాలో పెట్టాడు. రాత్రి మేడ మీద పడుకున్న సమయంలో, ఇంట్లో ఎవరూ లేరని గమనించిన దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న పది లక్షలు ఎత్తుకెళ్లారు. వేసిన బీరువా వేసినట్టే ఉంది.. కాని దొంగతనం జరిగింది.. సాయంత్రం డబ్బు కోసం చూసిన బాషా నగదు లేకపోయేసరికి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడకు చేరుకున్న కంచికచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కడపలోనూ ఇలాగే జరిగింది.. వెంకటేశ్వర బూక్​డిపో తలుపులు పగలకొట్టి 60 వేల సొమ్ము దోచేశారు. ఇలాంటి భారీ చోరీలు తరచూ జరుగుతూనే ఉన్నాయి...కష్టపడ్డ సొమ్మును ఊరికే వదిలేయకండి.. మాటువేసి దోచే దొంగలు మన చుట్టూనే ఉన్నారు .. జర చూసుకోండి మరీ...!

ఇదీ చూడండి:దొంగలు అరెస్ట్... పది వాహనాలు స్వాధీనం

Last Updated : Jul 13, 2019, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details