ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గన్నవరం విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత - gold seized at gannavaram airport news

కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. కువైట్ నుంచి వచ్చిన ముగ్గురు మహిళా ప్రయాణికుల నుంచి 1.865 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Gannavaram airport
Gannavaram airport

By

Published : Nov 19, 2020, 9:41 PM IST

విదేశాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న బంగారాన్ని కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వందే భారత్ మిషన్​లో భాగంగా కువైట్ నుంచి ప్రత్యేక విమానం గురువారం గన్నవరం విమానాశ్రయానికి వచ్చింది. అందులో నుంచి దిగిన ప్రయాణికులను తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులు... ముగ్గురు మహిళల హ్యాండ్ బ్యాగ్​లలో బంగారాన్ని గుర్తించారు.

వారి నుంచి సుమారు 95 లక్షల రూపాయలు విలువైన 1.865 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విమానాశ్రయ ఉన్నతాధికారులు విచారిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details