ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

YSR Zero Interest Scheme: మహిళా వికాసం కోసం సంక్షేమ పథకాలు: సీఎం జగన్​ - YSRCP

YSR Zero Interest Scheme : వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం నాలుగో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. శుక్రవారం డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో బటన్ నొక్కిన సీఎం.. నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసే ప్రక్రియను ప్రారంభించారు. సీఎం రాక సందర్భంగా జనసేన పార్టీ స్థానిక నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

YSR_Zero_Interest_Scheme
YSR_Zero_Interest_Scheme

By

Published : Aug 11, 2023, 7:55 PM IST

YSR Zero Interest Scheme: మహిళా వికాసం కోసం సంక్షేమ పథకాలు: సీఎం జగన్​

YSR Zero Interest Scheme: గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తాను మహిళా వికాసం కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అమలాపురంలోవైఎస్సార్ సున్నా వడ్డీ నాలుగో విడత మొత్తాన్ని బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై పలు విమర్శలు చేశారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు బ్యాంకు రుణాలకు చెల్లించిన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి వారికి చెల్లిస్తోంది. 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది బ్యాంకులకు చెల్లించిన 1,353.76 కోట్ల వడ్డీని వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రీయింబర్స్ చేయనుంది. ఈ మేరకు డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి మహిళల ఖాతాల్లో నగదు జమ ప్రారంభించారు. బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాల సభ్యులకు సున్నా వడ్డీ పథకం వర్తించనుంది. తాజాగా విడుదల చేసిన రూ.1,353.76 కోట్లతో కలిపి 'వైఎస్సార్ సున్నావడ్డీ పథకం' కింద మొత్తం రూ.4,969.05 కోట్ల సాయం అందించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

CM Jagan: 'నేతన్న నేస్తం' నిధులు విడుదల చేసిన సీఎం.. 'సేవకులపైనే విమర్శలా..?'

No Appointment డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో జరిగిన సభకు తరలి వచ్చిన డ్వాక్రా సంఘాల మహిళలు(Dwakra communities) సమావేశం మధ్యలోనే తిరిగి వెళ్లిపోయారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా సభలోంచి మహిళలు బయటకు వచ్చేశారు. అయితే, ముఖ్యమంత్రికి తమ సమస్యలను చెప్పుకునేందుకు వస్తే అపాయింట్​మెంట్ దొరకలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.సీఎం సభ నేపథ్యంలోఆయన అమలాపురం వస్తారని భావించి ఎంతోమంది వివిధ సమస్యలపై విన్నవించుకోవడానికి వచ్చారు. సీఎంను కలిసే అవకాశం దక్కకపోవడంతో నిట్టూర్చారు.

CM Jagan Review: లక్షల సంఖ్యలో ఇళ్లు కడుతున్నాం.. మౌలిక సదుపాయాలలో రాజీ పడొద్దు: సీఎం జగన్​

Muncipal Chairperson సీఎం సభా వేదికపై ఆమెకు దక్కని చోటు.. 'వైఎస్సార్ సున్నావడ్డీ పథకం' నిధుల విడుదల సభ నిర్వహించిన అమలాపురంలో.. స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్​కు వేదికపై అవకాశం దక్కలేదు. పట్టణ ప్రథమ పౌరురాలిగా ఆమెకు అవకాశం కల్పించాల్సిన అధికారులు.. అదేమీ పట్టించుకోలేదు. మున్సిపల్ చైర్ పర్సన్.. వైసీపీ(YCP)కి చెందిన రెడ్డి సత్య నాగేంద్ర మణి సభా వేదిక వద్దకు వెళ్లగా.. పాల్గొనే వారి జాబితాలో ఆమె పేరు లేదని అధికారులు తెలిపారు. దీంతో ఆవేదనకు గురైన ఆమె.. అటూ ఇటూ కలియతిరిగి హైరానా పడ్డారు.పట్టణ ప్రథమ పౌరురాలైన తనకు వేదికపై అవకాశం లేకపోవడం ఏమిటని అధికారులను ప్రశ్నించారు. ఇదే విషయాన్ని మున్సిపల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు దృష్టికి తీసుకెళ్లగా.. చివరకు ఆమె సభా వేదిక మీదకు వచ్చారు.

Jansena Leaders Arrest ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలాపురం రాక సందర్భంగా.. పోలీసులు ముందస్తుగా పలువురిని అరెస్టు చేశారు. జనసేన అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజాబాబు సహా మరి కొంతమందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అంబాజీపేట పోలీస్ స్టేషన్ తరలించారు. ముందస్తు అరెస్టులపై జనసైనికులు నిరసన వ్యక్తం చేశారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై జనసేన నాయకులు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఎస్సీలకు 27 ప్రభుత్వ పథకాల రద్దు, దళితులపై దాడులను నిరసిస్తూ సీఎం పర్యటనను అడ్డుకుంటామని జనసేన ప్రకటించింది. దీంతో ఈ ఉదయం అమలాపురంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉన్న నియోజకవర్గ ఇన్చార్జి శెట్టిబత్తుల రాజాబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. రాజబాబుని తరలిస్తున్న పోలీసు వాహనాన్ని జనసేన నాయకులు, కార్యకర్తలు అడ్డుకోగా.. వారందరినీ నెట్టేసి తరలించారు.

CM JAGAN REVIEW ON HIGHER EDUCATION: 3295 పోస్టుల భర్తీకి సీఎం జగన్‌ గ్రీన్ సిగ్నల్.. 23న నోటిఫికేషన్

ABOUT THE AUTHOR

...view details