‘ప్రభుత్వం వచ్చి మూడేళ్లయ్యింది. మా గ్రామంలో ఒక్క పక్కా ఇల్లు కూడా మంజూరు చేయలేదు. జగనన్న లేఅవుట్ స్థలం మెరక పనుల్లో అవినీతి జరిగింది. ఊరిలో ఒక్క వాలంటీర్ పోస్టు కూడా ఓసీలకు ఇవ్వలేదు. తాగేందుకు నీళ్లు లేవు’ అంటూ కోనసీమ జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును ముంగండ గ్రామంలో భావన శ్రీను అనే యువకుడు నిలదీశాడు. స్థానికులు మరికొందరు వివిధ సమస్యలను విన్నవించారు.
మూడేళ్లైనా ఒక్క ఇల్లూ ఇవ్వలేదు.. వైకాపా ఎమ్మెల్యేను నిలదీసిన యువకుడు - పి గన్నవరంలో వైకాపా ఎమ్మెల్యేను నిలదీసిన యువకుడు
Youngster questioned MLA Chittibabu: 'గడప గడపకు మన ప్రభుత్వం'లో భాగంగా కోనసీమ జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ముంగండ గ్రామంలో పర్యటించారు. ఈ క్రమంలో.. మా గ్రామంలో ఒక్క పక్కా ఇల్లు కూడా మంజూరు చేయలేదు. జగనన్న లేఅవుట్ స్థలం మెరక పనుల్లో అవినీతి జరిగిందంటూ.. ఓ యువకుడు ఎమ్మెల్యేను నిలదీశాడు.
వైకాపా ఎమ్మెల్యేను నిలదీసిన యువకుడు
'గడప గడపకు మన ప్రభుత్వం'లో భాగంగా ఎమ్మెల్యే శనివారం ముంగండకు రాగా, ప్రజలు వివిధ సమస్యలపై ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఓ దశలో వాగ్వాదం చోటు చేసుకుంది. ‘ఇలాంటి వాళ్లు వస్తుంటే మీరేం చేస్తున్నారు’ అంటూ ఎమ్మెల్యే పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. శ్రీనును అక్కడినుంచి బయటకు పంపే క్రమంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యేనే ప్రశ్నిస్తావా అంటూ వైకాపా నాయకులు యువకుడిపై మండిపడ్డారు.
ఇవీ చూడండి: