కోనసీమ జిల్లా ఊడిమూడి చింతావారిపేటలో దారుణం చోటుచేసుకుంది. పొలంగట్టు వివాదం ఓ యువతి ప్రాణం తీసింది. పొలంగట్టు విషయమై ఘర్షణ జరగ్గా..రైతు ఇంటికి వచ్చి ఐదుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ప్రత్యర్థుల దాడిలో రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. తన తండ్రిని కొట్టారనే మనస్థాపంతో రైతు కుమార్తె ఆత్మహత్యకు పాల్పడింది. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ప్రాణం తీసిన పొలం గట్టు వివాదం.. మనస్థాపంతో యువతి ఆత్మహత్య ! - కోనసీమ జిల్లాలో యువతి ఆత్మహత్య
పొలంగట్టు వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. ప్రత్యర్థులు తన తండ్రిని కొట్టారనే మనస్థాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన కోనసీమ జిల్లా ఊడిమూడి చింతావారిపేటలో చోటుచేసుకుంది.
ప్రాణం తీసిన పొలం గట్టు వివాదం