YEDURULANKA: గౌతమి గోదావరి మహోగ్రరూపానికి కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం ఎదురులంక గ్రామ ప్రజలు అల్లాడిపోయారు. ఏటా వరద ప్రభావానికి గురవుతున్నా.. ఈసారి ఉప్పెనలా వచ్చిపడిన వరద ధాటికి... సర్వం కోల్పోయారు. వారం రోజులుగా గట్టుపై ఉన్న బడ్డీదుకాణమే ఆవాసంగా మారింది. చిన్నపిల్లలు, గర్భిణీలతో పాటు.. గ్రామ ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. సుమారు 100 ఇళ్లను అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా వరద ప్రవాహం ముంచెత్తడంతో... ఇంట్లోని వస్తువును కూడా తీసుకోలేకపోయామని వాపోతున్నారు.
"వరద మిగిల్చిన గోడు.. ఆదుకున్న బడ్డీ కొట్టు" - ఎదురులంక వరద బాధితుల సమస్యలు
YEDURULANKA: వాళ్లకి ఏటా వరదలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా అలానే వచ్చాయి. ఏం జరుగుతుందిలే అనుకున్న వారిని కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబెట్టింది. తలదాచుకోవడానికి గూడు లేక, తినడానికి తిండి లేక ఎన్నో అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో కుటుంబ పోషణ కోసం గట్టుపై నిర్వహించుకునే చిన్న బడ్డీదుకాణమే వారికి ఆవాసంగా మారింది.

"వరద మిగిల్చిన గోడు.. ఆదుకున్న బడ్డీ కొట్టు"
"వరద మిగిల్చిన గోడు.. ఆదుకున్న బడ్డీ కొట్టు"