attack on salon owner: తెలంగాణలోని హనుమకొండ జిల్లా కేంద్రంలో ఇద్దరు వ్యక్తులు ఓ సెలూన్ యజమానిని చితకబాదారు. దాడి ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. వివరాల్లోకి వెళితే.. నైమ్నగర్లోని రేయలెన్స్ సెలూన్‌కు శుక్రవారం రాత్రి 10 గంటలకు ఇద్దరు వ్యక్తులు వచ్చి హెడ్ మసాజ్ చేయాలని అడగగా.. సమయం లేదని సెలూన్ యజమాని రంజిత్ చెప్పాడు. దీంతో యువకులు గొడవకు దిగారు. యజమాని రాజేశ్‌పై ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.
వీడియో: హెడ్మసాజ్ చేయలేదని సెలూన్ యజమానిని చితకబాదిన యువకులు - saloon shop lo godava
attack on salon owner: ప్రస్తుత రోజుల్లో కొందరు యువకులు కారణం లేకుండానే గొడవలు పెట్టుకుంటున్నారు. చిన్న, చిన్న విషయాలకే ఎదుటి వారిపై దాడులు చేస్తున్నారు. ఇలాంటి ఘటనే హనుమకొండలో చోటుచేసుకుంది.
యువకుల దాడి
ఈరోజు హనుమకొండ పోలీస్‌స్టేషన్‌లో యజమాని రాజేశ్ దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇవీ చదవండి: