Two people died while changing electricity pole: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో పాత విద్యుత్ స్తంభం మారుస్తుండగా విరిగిపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనలో స్థానికులు రవి బాబు (45), నారాయణ (45) చనిపోయారు. రవిబాబు అక్కడికక్కడే మృతి చెందగా, నారాయణను అమలాపురంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆసుపత్రికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. జరిగిన సంఘటన పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.
విద్యుత్ స్తంభం మారుస్తూ ఇద్దరు వ్యక్తులు మృతి - ap latest updates
Two people died while changing electricity pole: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో విషాదం జరిగింది. పాత విద్యుత్ స్తంభం మారుస్తుండగా విరిగిపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. రవి బాబు (45) అక్కడికక్కడే మృతి చెందగా, నారాయణ (45) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
elecrical pole