ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Konaseema SP: కోనసీమ ఎస్పీ సుబ్బారెడ్డిపై బదిలీ వేటు - Konaseema news

Transfer hunt on Konaseema SP: కోనసీమ ఎస్పీ సుబ్బారెడ్డిని మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరో బెటాలియన్‌ కమాండెంట్‌గా బదిలీ చేశారు. మొత్తం అయిదుగురు ఐపీఎస్‌ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన కోనసీమ అల్లర్ల నేపథ్యంలో సుబ్బారెడ్డిపై బదిలీ వేటు పడింది.

Transfer hunt on Konaseema SP
Transfer hunt on Konaseema SP

By

Published : Jun 17, 2022, 8:09 AM IST

Konaseema SP Transfer: కోనసీమ ఎస్పీ కె.ఎస్‌.ఎస్‌.వి.సుబ్బారెడ్డిపై వేటు పడింది. ఆయన్ను మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరో బెటాలియన్‌ కమాండెంట్‌గా బదిలీ చేశారు. అమలాపురంలో ఇటీవల పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగి మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌ల ఇళ్లు దహనమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డిపై బదిలీ వేటుపడింది. మొత్తం అయిదుగురు ఐపీఎస్‌ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

కర్నూలు ఎస్పీగా పనిచేస్తున్న సీహెచ్‌ సుధీర్‌కుమార్‌రెడ్డిని కోనసీమ ఎస్పీగా బదిలీ చేశారు. కృష్ణా ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సిద్ధార్థ్‌ కౌశల్‌ను కర్నూలుకు పంపారు. విజయవాడ శాంతిభద్రతల విభాగం డీసీపీ జాషువాను కృష్ణా ఎస్పీగానూ, మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్‌ కమాండెంట్‌ విశాల్‌ గున్నీని విజయవాడ శాంతిభద్రతల విభాగం డీసీపీగానూ బదిలీ చేశారు.

ఇదీ చదవండి: బీమా పరిహారంలో అక్రమాలు.. ఆగ్రహంతో భరోసా కేంద్రానికి తాళం

ABOUT THE AUTHOR

...view details