Electric shock: కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దొంతికుర్రులో విషాదం చోటు చేసుకుంది. జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యుదాఘాతంతో ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా ఓ విద్యార్థి మృతి చెందాడు. తీవ్రగాయాలైన వివేక్, సతీశ్ ఆమలాపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. మరో ఇద్దరు విద్యార్థులు నిఖిల్, మహిధర్‌కు స్వల్పగాయాలయ్యాయి. పాఠశాల పక్కన గ్రామ సచివాలయం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ ఉన్న ఇనుప ఊచలను మిషన్‌తో కోస్తుండగా విద్యుత్ సరఫరా అయింది. మంచినీరు తాగేందుకు వచ్చిన విద్యార్థులు ఊచలు పట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
గ్రామ సచివాలయ పనుల్లో విద్యుదాఘాతం.. ఆస్పత్రికి తరలిస్తుండగా విద్యార్థి మృతి - కోనసీమ జిల్లా తాజా వార్తలు
Electric shock: కోనసీమ జిల్లాలో విద్యుదాఘాతంతో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. అసలేం జరిగిందంటే..?
విద్యుదాఘాతంలో ముగ్గురు విద్యార్థులకు గాయాలు
అస్పత్రికి తరలిస్తుండగా నవీన్ అనే ఏడేళ్ల బాలుడు మార్గమధ్యంలోనే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మరో మరో ఇద్దరు కోలుకుంటున్నారని తెలిపారు. మృతుడు నవీన్ తల్లి ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లగా... ముగ్గురు అక్కలతో కలిసి ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇవీ చదవండి:
Last Updated : Oct 28, 2022, 5:44 PM IST