కోనసీమ జిల్లా రాజోలులో వైకాపాకు కార్యకర్తలు అధిక సంఖ్యలో రాజీనామాలు చేస్తున్నారు. బుధవారం సఖినేటిపల్లి మండలం గుడిమూలకు చెందిన వైకాపా రాష్ట్ర కార్యదర్శి రుద్రరాజు వెంకటరామరాజుతో పాటు పలువురు రాజీనామా చేశారు. వైకాపా విజయానికి పని చేసిన వారిని పక్కన పెట్టి జనసేన నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారని.. దీంతో అసలైన కార్యకర్తలమైన తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.
వైకాపాకు షాక్.. వెయ్యి మంది రాజీనామా! - రాజోలు వార్తలు
కోనసీమ జిల్లాకు చెందిన వైకాపా రాష్ట్ర కార్యదర్శి రుద్రరాజు వెంకటరామరాజుతోపాటు పలువురు నేతలు వైకాపాకు రాజీనామా చేశారు. పార్టీ కోసం పని చేసిన వారిని పక్కన పెట్టి.. జనసేన నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారని వెంకటరామరాజు ఆరోపించారు. అందుకే తనతోపాటు వెయ్యి మంది కార్యకర్తలు వైకాపాకు రాజీనామా చేస్తునట్లు తెలిపారు.
తమతోపాటు ఉన్న వెయ్యి మంది కార్యకర్తలు రాజీనామా పత్రాలు సమర్పించనున్నట్లు రుద్రరాజు వెంకటరామరాజు తెలిపారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పలుమార్లు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా.. జనసేన నుంచి వచ్చిన వారి వెంట వెళ్లాలని సూచిస్తున్నారని.. దీంతో మనస్తాపం చెందినట్లు పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వ మూడేళ్ల పాలనపైనా వెంకటరామరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెదేపా నుంచి ఆహ్వానం వచ్చిందని, కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెంకటరామరాజు ప్రకటించారు.
ఇవీ చదవండి: