Sea rushing forward: కొనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో సముద్రం అలజడి రేపింది. ఇటీవల వచ్చిన అసని తుపాన్ ప్రభావం సముద్రంపై ఉండడం,.. ఈరోజు పౌర్ణమి కావడంతో కెరటాలు ముందుకు వచ్చాయి. సుమారు 200 మీటర్లు ముందుకు రావడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. పల్లిపాలెం వద్ద జనావాసాల్లోకి నీళ్లు చేరాయి. తీరప్రాంతం కోతకు గురవడంతో.. సరుగుడు, కొబ్బరి చెట్లు సముద్ర గర్భంలో కలసి తీవ్రంగా నష్టపోతున్నామని స్థానికులు వాపోతున్నారు.
అంతర్వేదిలో ముందుకొచ్చిన సముద్రం.. జనావాసాల్లోకి నీరు - కోనసీమ జిల్లాలో ముందుకొస్తున్న సముంద్రం
Sea rushing forward: సముద్ర తీర ప్రాంతాల్లో అసని తుపాను ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది.. తుపాను ఉద్ధృతి పూర్తిగా తగ్గకపోవడం.. పౌర్ణమి రాకతో సముద్ర జలాలు ఎగసిపడుతున్నాయి.. అలలకు తీర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం అంతర్వేదిలో సముద్రం 200 మీటర్లు ముందుకొచ్చింది.
అంతర్వేదిలో ముందుకొచ్చిన సముద్రం