Rajamahendravaram: రాజమహేంద్రవరం రాజధానిగా వేంగీ రాజ్యాన్ని పాలించిన తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుడి పట్టాభిషేక సహస్రాబ్ది ఉత్సవాన్ని కోనసీమ జిల్లా అమలాపురంలో కోనసీమ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు గౌరవ అతిథులుగా నానీ రాజు, అద్దంకి అమరేశ్వర రావు పాల్గొన్నారు. ప్రముఖ కవి బీవీవీ ఈ ఉత్సవానికి అధ్యక్షత వహించారు. అద్దంకి అమరేశ్వర రావు, రాజరాజ నరేంద్రుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నరేంద్రుని తెలుగుభాషా సాహిత్యాలు, పరిపాలన అభివృద్ధిని, ఆస్థాన కవి, ఆది కవి నన్నయ్య మహాభారత రచనలను కొనియాడారు.
అమలాపురంలో రాజరాజ నరేంద్రుడి పట్టాభిషేక సహస్రాబ్ది ఉత్సవాలు - Ap Latest News
Rajamahendravaram తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుని పట్టాభిషేక సహస్రాబ్ది ఉత్సవాలను అమలాపురంలో కవులు, రచయితలు ఘనంగా నిర్వహించారు. తెలుగు సాహిత్యం గురించి రాజరాజ నరేంద్రుడు చేసిన కృషిని పలువురు గుర్తు చేశారు.
కందుకూరి వీరశలింగం, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, రాళ్ళబండి సుబ్బారావు, కట్టమంచి రామలింగారెడ్డి సేవలను పలువురు గుర్తు చేసుకున్నారు. రాజరాజ నరేంద్రుని తెలుగు సాహితీ వైభవం రాజమహేంద్రవరాన్ని మరిచిపోలేని విధంగా చెబుతోందని ప్రముఖ కవి బీవీవీ అన్నారు. ఆదికవి నన్నయ్య వంటి కవులు రాజరాజ నరేంద్రుని పోషణలో ఎన్నో తెలుగు గ్రంథాలు రచించారని సీనియర్ అధ్యాపకులు నల్ల నరసింహమూర్తి వివరించారు. రాజరాజ నరేంద్రుని తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల వివరాలను గిరి దంపతులు వివరించారు. రాజరాజ నరేంద్రుని శాసనాలు, శిలావిగ్రహాలు.. రైల్వేస్టేషన్, గోదావరి గట్టు తదితర ప్రాంతంలో ఉన్నాయని విత్తనాల వేంకటేశ్వరరావు గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ చరిత్ర వైభవం తెలుసుకోవాలని కుంపట్లు సుభాషిణి తెలిపారు.
ఇవీ చదవండి: