TDP Protest in P.Gannavaram: కోనసీమ జిల్లా పి.గన్నవరంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట.. రాష్ట్రప్రభుత్వం పింఛన్లు తొలిగింపుపై తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసనలు తెలిపారు. తొలిగించిన సామాజిక పింఛన్లు వెంటనే పునరుద్ధించాలంటూ డిమాండ్ చేశారు. గన్నవరం నియోజకవర్గంలో సుమారు 300కు పైగా వృద్ధాప్య పింఛన్లు అన్యాయంగా తొలిగించారని టీడీపీ శ్రేణులు వాపోయారు. వైసీపీ ప్రభుత్వం వృద్ధుల పట్ల అన్యాయం చేస్తుందని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ మేరకు బాధితులకు న్యాయం చేకూర్చాలని గన్నవరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
పింఛన్లు తొలగించారని.. తహసీల్దార్ కార్యాలయం ఎదుట టీడీపీ నిరసన - Telugu latest news
TDP Protest in P.Gannavaram: రాష్ట్ర ప్రభుత్వం సామాజిక పింఛన్లు తొలగించడంపై.. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు.. వృద్ధాప్య పింఛన్ల రద్దును నిరసిస్తూ కోనసీమ జిల్లాలో టీడీపీ శ్రేణులు..బాధితులకు న్యాయం చేకూర్చాలని గన్నవరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
టీడీపీ శ్రేణులు