ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమలాపురం అల్లర్లకు ప్రభుత్వ అనాలోచిత వైఖరే కారణం: సోము వీర్రాజు - somu veerraju fire

Somu Veerraju: కోనసీమ జిల్లా అమలాపురం అల్లర్లకు ప్రభుత్వ అనాలోచిత వైఖరే కారణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. అల్లర్ల కారణంగా ఇబ్బందులకు గురవవుతున్న వారితో మాట్లాడేందుకు వెళుతుంటే పోలీసులు తనను అడ్డుకోవడాన్ని ఆయన త్రీవంగా ఖండిస్తున్నానని అన్నారు.

అమలాపురం అల్లర్లకు ప్రభుత్వ అనాలోచిత వైఖరే కారణం
అమలాపురం అల్లర్లకు ప్రభుత్వ అనాలోచిత వైఖరే కారణం

By

Published : Jun 8, 2022, 3:14 PM IST

Updated : Jun 8, 2022, 3:30 PM IST

Somu Veerraju on Amalapuram incident: అమలాపురం అల్లర్లకు ప్రభుత్వ అనాలోచిత వైఖరే కారణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ పిరికిపంద చర్యలకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. కోనసీమ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు నందం శ్రీలక్ష్మి తల్లి మృతి చెందడంతో ఆమెను పరామర్శించడానికి సోము బయల్దేరి వెళ్లారు. అల్లర్ల కారణంగా ఇబ్బందులకు గురవుతున్న వారితో మాట్లాడేందుకు అమలాపురం వెళుతుంటే పోలీసులు తనను అడ్డుకోవడాన్ని త్రీవంగా ఖండిస్తున్నామన్నారు. తాను రాజమహేంద్రవరం నుంచి బయలుదేరినప్పటి నుంచి పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనుమతి నిరాకరణ:అంతకుముందు తూర్పు గోదావరి జిల్లా జొన్నాడ వద్ద సోము వీర్రాజును పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. అల్లర్ల బాధితులు, కేసు నమోదైన కుటుంబాల పరామర్శకు.. సోము వీర్రాజు వెళ్తుండగా అడ్డుకున్నారు. అమలాపురం పర్యటనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. జొన్నాడ వద్ద అరగంటపాటు సోము వీర్రాజును ఆపేశారు. తూర్పుగోదావరి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు నందం శ్రీలక్ష్మి కుటుంబ పరామర్శకు మాత్రం అనుమతి లభించింది.

సోము వీర్రాజును అడ్డుకున్న పోలీసులు

ఇవీ చూడండి

Last Updated : Jun 8, 2022, 3:30 PM IST

ABOUT THE AUTHOR

...view details