ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"మంత్రి తీరు దుర్మార్గం.. క్షమాపణ చెప్పకపోతే బుద్ధి చెపుతాం"

శెట్టిబలిజ జాతికి మంత్రి వేణుగోపాలకృష్ణ క్షమాపణ చెప్పాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శెట్టిబలిజ జాతి జగన్‌కు రుణపడి ఉంటుందంటూ మంత్రి.. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కాళ్ల వద్ద మోకరిల్లటంపై వారు తీవ్రస్థాయిలో మండిప్డడారు.

"మంత్రి క్షమాపణలు చెప్పాలి.. లేదంటే ఉద్యమం చేస్తాం"
"మంత్రి క్షమాపణలు చెప్పాలి.. లేదంటే ఉద్యమం చేస్తాం"

By

Published : May 2, 2022, 3:23 PM IST

"మంత్రి క్షమాపణలు చెప్పాలి.. లేదంటే ఉద్యమం చేస్తాం"

శెట్టిబలిజ జాతి జగన్‌కు రుణపడి ఉంటుందంటూ మంత్రి వేణుగోపాలకృష్ణ.. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కాళ్ల వద్ద మోకరిల్లటంపై శెట్టిబలిజ సంఘం నాయకులు తీవ్రంగా మండిప్డడారు. కోనసీమ జిల్లా పి.గన్నవరంలో సమావేశమైన శెట్టి బలిజ సంఘ నాయకులు.. మంత్రి తీరును ఖండించారు. శెట్టిబలిజ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పి.గన్నవరంలో నిరసన ప్రదర్శన చేశారు. మంత్రి క్షమాపణలు చెప్పకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

మంత్రి ఏమన్నారంటే..: గత నెల 30న కోనసీమ జిల్లా అమలాపురంలో దివంగత మాజీ శాసనసభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి సంస్మరణ సభ నిర్వహించారు. సభలో పాల్గొన్న రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మోకాళ్లపై కూర్చొని, శిరసు వంచి తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి దండాలు పెట్టారు. "ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మీరూ అందించిన సహకారం మరువలేనిది.. మీకు మా సామాజికవర్గం మొత్తం రుణపడి ఉంటుంది" అని చెబుతూ.. వైవీ సుబ్బారెడ్డి ఎదుట శిరస్సు వంచి మోకాళ్ళపై ప్రణమిల్లి నమస్కరించారు. మంత్రి మోకాళ్లపై కూలబడటం..,తలవంచి దండాలు పెట్టిన తీరు చూసి అక్కడున్నవారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఇదీ చదవండి: తితిదే ఛైర్మన్ కు.. శిరసు వంచి మోకాళ్లపై కూర్చొని దండాలు పెట్టిన మంత్రి..!

ABOUT THE AUTHOR

...view details