Sarpanches : గ్రామ పంచాయతీల్లో నిధుల కొరతతో ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఓ మహిళా సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా చనిపోతే మృతదేహాల దగ్గర ముగ్గు చల్లటం, పెళ్లిళ్లు జరిగిన చోట ఎంగిలి విస్తరాకులు ఎత్తడం తప్ప ఏమీ చేయలేకపోతున్నామంటూ వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంచాయతీలకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే ఆందోళనకు దిగేందుకు వెనకాడబోమని చెప్పారు.
ఎంగిలాకులు ఎత్తడం, మృతదేహాల దగ్గర ముగ్గు చల్లటం.. ఇవి సర్పంచ్ విధులు
Sarpanches Appeal To Government : గ్రామంలో అభివృద్ధి పనులు జరగాలంటే సకాలంలో నిధులు మంజూరు కావాలి. అలా లేని పక్షంలో అభివృద్ధి కుంటుపడుతుంది. తాజాగా కోనసీమ జిల్లాలో పంచాయతీ నిధులు మంజూరు చేయాలని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు.
Sarpanches Appeal To Government