ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మా నాయకుడికి మంచి బుద్ధిని ప్రసాదించు వినాయక: సర్పంచ్

Ambedkar Konaseema దిండి గ్రామంలో సర్పంచ్ ముదునూరి శ్రీనివాసరాజు వినాయక చతుర్దశి వేడుకను వినూత్నంగా నిర్వహించారు. తన కున్న ఆక్వా చెరువు మధ్యలో వినాయక మండపం ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. ఓ వినాయక నన్ను సర్పంచిగా ఎందుకు గెలిపించావు? అంటూ తన అవేదన వ్యక్తం చేశారు.

By

Published : Sep 1, 2022, 11:27 AM IST

Sarpanch of the village who innovatively organized
మా నాయకుడికి మంచి బుద్ధిని ప్రసాదించు వినాయక: సర్పంచ్

Dindi Sarpanch అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం దిండి గ్రామంలో సర్పంచ్ ముదునూరి శ్రీనివాసరాజు వినాయక చవితి వేడుకను వినూత్నంగా నిర్వహించారు. తన ఆక్వా చెరువు మధ్యలో వినాయక మండపం ఏర్పాటు చేసి చెరువులోనే పూజలు నిర్వహించారు. ఓ వినాయక నన్ను సర్పంచిగా ఎందుకు గెలిపించావు? అంటూ తన అవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన మాట నెరవేర్చలేకపోతున్నానంటూ బాధ పడ్డాడు. ఇప్పటివరకు ఏడాదిన్నర ముగుస్తున్నా తట్ట మట్టి రోడ్డుపై వేయలేని పరిస్థితిలో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామంలో మా విధులు ఏంటో మాకు అర్థం కాక, నేను ఎందుకు సర్పంచ్ గా గెలిచానో అర్థం కావడం లేదని వినాయకుడితో మెురపెట్టుకున్నాడు. వార్డు సభ్యులు ఎం చేయాలో తెలియని పరిస్థితి ఉందని వినాయకుడి ఎదుట నిస్సహాయత వ్యక్తం చేశాడు. స్వామి వినాయకా.. సీఎం జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించండి అంటూ దిండి సర్పంచ్ శ్రీనివాసరాజు వేడుకున్నారు.

పూజ నిర్వహిస్తున్న సర్పంచ్​ శ్రీనివాసరాజు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details