ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోనసీమలో ఘనంగా సంక్రాంతి సంబరాలు... - Sankranti celebrations in Konaseema

Dr. BR Ambedkar Konaseema District: అంబేద్కర్​ కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. కనుమ రోజున ప్రభలతో ఊరేగింపుగా వెళ్లి.... గ్రామ దేవతలను పూజించారు. ప్రభలను పంటచేలు, ఆక్వా చెరువుల మీదుగా ఉత్సవ ప్రాంతాలకు తీసుకెళ్లారు. ప్రజలు పట్టణాల నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారంతా ప్రభల తీర్థాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. భారీ ఎత్తున బాణసంచాతో సాగిన ప్రభల ఊరేగింపు అందరికీ కనువిందు కలిగించింది.

Dr. BR Ambedkar Konaseema District
కోనసీమలో ఘనంగా సంక్రాంతి సంబరాలు... వీనుల విందుగా ప్రభల తీర్థాలు

By

Published : Jan 16, 2023, 10:56 PM IST

కోనసీమలో ఘనంగా సంక్రాంతి సంబరాలు... వీనుల విందుగా ప్రభల తీర్థాలు

Dr. BR Ambedkar Konaseema District: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం లోని పల్లెపాలెం గ్రామంలో ప్రభల తీర్థాన్ని వేడుకగా జరుపుకొన్నారు. ముమ్మడివరం పరిధిలోని సలాదవారిపాలెం.. కొత్తపేట.. రాజుపాలెం.. సోమదేవరపాలెం.. మరో 10 గ్రామాలు చెందిన ప్రభలను స్థానిక గ్రామ పెద్దలు యువకులు భుజాలపై మోసుకుంటూ ప్రధాన రహదారులు.. పంట కాలువలు.. ఆక్వా చెరువులు మీదుగా పల్లిపాలెం లోని ఉత్సవం జరిగే ప్రాంతానికి చేర్చారు.. అన్ని గ్రామాల నుంచి వచ్చిన ఫ్రభలను ఒక వరుస క్రమంగా నిలబెట్టటంతో ఆ ప్రాంతమంతా ప్రత్యేక శోభను సంతరించుకుంది.. ప్రభలపై నిలబడి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు... వివిధ రాష్ట్రాల నుండి సొంతూరుకు కి వచ్చిన వారితోపాటు ఐ పోలవరం.. ముమ్మిడివరం.. మండలాలు నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రభలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు..

గ్రామ దేవతలను కొలుస్తూ ప్రభల ఊరేగింపులు ఉత్సాహంగా సాగాయి. పంట పొలాలను తొక్కుకుంటూ, ఆక్వా చెరువులను దాటిస్తూ ప్రభలను తీర్థప్రదేశాలకు తరలించిన తీరు ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. ఈ ప్రాంతంలో సుమారు 150 గ్రామాలలో 500 ప్రభలు తీర్థాలలో కొలువు తీరాయి. వేల సంఖ్యలో జనం తీర్థాలకు తరలి ప్రభలను మొక్కుకుని చల్లగా చూడు తల్లి అంటూ ప్రార్థించారు. సంక్రాంతి నేపథ్యంలో ఏడాదికోసారి కనుమ రోజు జరిగే ప్రబల తీర్థాలకు సుదూర ప్రాంతాల నుంచి రెక్కలు కట్టుకుని ఇక్కడికి వచ్చి వాలిపోయారు. తీర్థాలను తిలకించి తన్మయం చెందారు. భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముమ్మిడివరం సర్కిల్ ఇన్​స్పెక్టర్​ జానకి రామ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు...

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details