ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

23 ఏళ్లుగా స్వామివారి సేవలో.. రాములోరి పెళ్లికి కోనసీమ బోండాలు - Rama Reddy sending coconuts to Bhadradri

Sri Ramanavami in Bhadrachalam: భద్రాచంలంలో శ్రీ రామనవమి రోజున ఘనంగా జరిగే సీతారాముల కల్యాణానికి ఉపయోగించే కళ్యాణ బోండాలు కోనసీమ జిల్లావే. 23 ఏళ్ల నుంచి మండపేటకు చెందిన ఓ కుటుంబం క్రమం తప్పకుండా.. భక్తి శ్రద్ధలతో అలంకరించి వాటిని స్వామి కల్యాణానికి సిద్ధంచేస్తోంది.

Sri Ramanavami in Bhadrachalam
Sri Ramanavami in Bhadrachalam

By

Published : Mar 30, 2023, 7:31 AM IST

23ఏళ్లుగా స్వామివారి సేవలో రామిరెడ్డి కుటుంబం.. సీతారాముల కల్యాణ బోండాలు కోనసీమవే!

Sri Ramanavami in Bhadrachalam: భద్రాద్రి సీతారాముల కళ్యాణమహోత్సవంలో వినియోగించే కళ్యాణ బోండాలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నుంచి ఓ కుటుంబం సమర్పిస్తోంది. 23 ఏళ్లుగా క్రమం తప్పకుండా భక్తి శ్రద్ధలతో అందిస్తోంది. అలాగే ఒంటిమిట్ట, అన్నవరం, అంతర్వేది. ఇలా వివిధ ఆలయాల పరిణయ మహోత్సవాలకూ కళ్యాణ బోండాలు ఇస్తున్నారు.

మండపేటకు చెందిన భక్తుడు రామారెడ్డి పాతికేళ్ల క్రితం సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భద్రాద్రి వెళ్లారు. పరిణయ మహోత్సవ క్రతువులో వినియోగించే కళ్యాణ బోండాలు స్వామికి సమర్పిస్తామని ఆలయ అధికారుల్ని సంప్రదించారు. వారు అంగీకరించడంతో 23 ఏళ్లుగా క్రమం తప్పకుండా వీటిని అందిస్తున్నారు. శంకు, చక్రాలతో మూడు బోండాలను తయారు చేసి శ్రీరామనవమి మహోత్సవాలకు తీసుకెళ్లారు. రామతత్వాన్ని ప్రచారం చేసే భాగ్యం తమకు కలగడం సంతోషంగా ఉందని రామారెడ్డి చెబుతున్నారు.

రామారెడ్డి కుటుంబ సభ్యులు కళ్యాణ బోండాలు స్వయంగా తయారు చేస్తారు. భద్రాచలంతోపాటు ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం, అన్నవరం, అంతర్వేది కళ్యాణ మహోత్సవాలకూ, శ్రీరామనవమి సందర్భంగా గొల్లల మామిడాడ, సత్యవాడ, మండపేట తదితర ప్రాంతాల్లోని శ్రీరామ నవమి వేడుకలకు కళ్యాణ బోండాలు ఈ కుటుంబం నుంచే పంపిస్తారు. వీరు స్థానికంగా కళ్యాణ బోండాలు తయారు చేసి వివాహాలకు విక్రయిస్తుంటారు. ప్రముఖ ఆలయాల కళ్యాణ మహోత్సవాలకు వీటిని స్వయంగా తయారు చేసి పంపించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్టు రామారెడ్డి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణానికి శంకు, చక్ర, నామాలు చిత్రించి కుటుంబ సమేతంగా ఆ కళ్యాణానికి పట్టుకెళ్లడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరంతో 23వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరుగుతుంది. అలాగే రాష్ట్రం విడిపోయాక జిల్లాలోని అన్ని ప్రాంతాలకు పెద్ద కొబ్బరి బోండాలు సేకరించి తయారుచేసి ఉచితంగా రాముల వారి కళ్యాణానికి అందజేయడం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ కాబట్టి అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.- రామారెడ్డి, మండపేట

గత 23 సంవత్సరాలుగా మా చెల్లి, బావ భద్రాద్రి సీతారాముల వారికి కొబ్బరి బోండాలను తీసుకు వెళ్తున్నారు. వీళ్లు ప్రతీ సంవత్సరం చుట్టు పక్కల గ్రామాల దేవాలయాలకు ఇంటి నుంచి కొబ్బరి బోండాలను తీసుకువెళ్లి రాముల వారికి ఎంతో సేవ చేసుకుంటున్నారు. వీళ్లు ఇలా చేయడం మాకు చాలా గర్వంగా ఉంది.- మహేంద్ర, రామారెడ్డి బావమరిది

శ్రీ రాముడికి ఈ బోండాలు ఇలా డెకరేషన్ చేసి పంపిస్తున్నందుకు.. అందులో మేము అందరం పాలుపంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాం.. ఇక్కడ ఇలా చేస్తున్నందుకు ఆ దేవుడికి దగ్గర పెట్టే కొబ్బరి బోండాలను మా చేతుల మీద చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.- స్థానికురాలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details