కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో మూడు రోజుల క్రితం చోటు చేసుకున్న విధ్వంసకర ఈ సంఘటన నేపథ్యంలో.. ఏర్పాటు చేసిన పటిష్ఠ పోలీసు బందోబస్తు ఈరోజు కాస్త సడలించారు. పౌరుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆంక్షలు సడలించారు. దాంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
Tension at Amalapuram: కోనసీమ జిల్లా అమలాపురం ఆందోళనలతో అట్టుడికింది. కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ.. కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ కార్యాలయానికి వందలాదిగా చేరుకున్న నిరసనకారులు బస్సులను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు పలువురు నిరసనకారులకు గాయాలయ్యాయి.