కోనసీమ జిల్లా తాళ్లరేవు మండలంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్‌కు నిరసన సెగ తగిలింది. దిండి గ్రామంలో ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్‌ను మహిళలు తమ సమస్యలపై నిలదీశారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు ఘోరంగా ఉన్నాయని.. పాములు ఇళ్లలోకి వచ్చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు వస్తున్నారని వీధుల శుభ్రం చేసి బ్లీచింగ్ జల్లారని ఇలాగైతే ఎలా బతకాలని ఎమ్మెల్యేను నిలదీసింది. మరో మహిళ గతంలో మీరు ఇంటి పట్టా ఇచ్చి 'ఇల్లు మేమే కడతాం.. మీరు పాలు పొంగించుకుని ఇంట్లోకి వెళ్లటమే' అని అన్నారని ఇప్పటివరకు ఇంటికి సంబంధించి ఒక ఇటుక కూడా పెట్టలేదని నిలదీసింది.
గడపగడపకు నిలదీతలు.. వైకాపా ఎమ్మెల్యేకు చేదు అనుభవం
గడగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైకాపా ఎమ్మెల్యేలకు నిరసన సెగలు తప్పటం లేదు. ప్రజలు తమ సమస్యలపై ఎమ్మెల్యేలను, మంత్రులను ఎక్కడిక్కడ నిలదీస్తూనే ఉన్నారు. తాజాగా.. కోనసీమ జిల్లా తాళ్లరేవు మండలం దిండి గ్రామంలో ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్‌ను మహిళలు తమ సమస్యలపై నిలదీశారు.
వైకాపా ఎమ్మెల్యేకు చేదు అనుభవం