అన్నపూర్ణ లాంటి తూర్పుగోదావరి జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ప్రభుత్వం చోద్యం చూస్తోందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. కోనసీమ జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన 67 కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి నేడు పవన్‌కల్యాణ్ మండపేట వస్తున్నారని తెలిపారు. భారీ బహిరంగ సభకు జన సేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
నేడు కోనసీమ జిల్లాలో పవన్ పర్యటన.. కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం - నేడు కోనసీమ జిల్లాలో పవన్ పర్యటన
కోనసీమ జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన 67 కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మండపేట రానున్నట్లు ఆపార్టీ నేత నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కౌలు రైతు భరోసా పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
నేడు కోనసీమ జిల్లాలో పవన్ పర్యటన