Out of date chikkilu: విద్యార్థులకు అందించాల్సిన పౌష్టికాహార చిక్కీలు కాలం చెల్లిపోవటంతో... కోనసీమ జిల్లా ముమ్మిడివరం కాలవ గట్టు వద్ద గుట్టలు గుట్టలుగా పడేశారు. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ప్రభుత్వం చిక్కీలు అందిస్తున్నామనడం ఒట్టి ప్రచారమే అన్నట్టుగా ఇక్కడి దృశ్యాలను బట్టి తెలుస్తోంది. ఇదే తరహాలో గతేడాది చిక్కీలు పడేసి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు.. అధికారులకు ఫిర్యాదు చేయటంతో విచారణ చేపట్టారు. పూర్తిస్థాయిలో విద్యార్థులకు పంపిణీ చేయకపోటంతోనే పౌష్టికాహారం కాలం చెల్లిపోయి వృథా అవుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారులకు ఇవ్వాల్సిన చిక్కీలు కాలం చెల్లాయి - కోనసీమ జిల్లా ముమ్మిడివరం కాలవ గట్టు
Out of date chikkilu: నా అక్క చెల్లెమ్మల పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ ప్రతి సమావేశంలో చెప్తూ వారి కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామన్నారు. జగనన్న పౌష్టికాహారం పథకం ద్వారా పాఠశాలల్లో చదివే విద్యార్థులు రక్తహీనత రాకుండా మధ్యాహ్న భోజనంతో పాటు చిక్కీలు.. కోడిగుడ్లు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటారు.. కానీ అవి కొన్నిచోట్ల విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందకుండా వృథా అవుతున్నాయి. అలాంటి ఘటనే కోనసీమ జిల్లాలో జరిగింది.
Out of date chikkilu