Flood Problems: డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంకలో గురువారం పెళ్లి చేసుకున్న నూతన జంట.. వరుడు ఇంటికి సుమారు 5కిలో మీటర్ల పడవ ప్రయాణం చేశారు. అప్పనరామునిలంకకు చెందిన బర్రె నాగబాబుకు, అంతర్వేదిపాలేనికి చెందిన జననితో వివాహం నిశ్చయమైంది. సఖినేటిపల్లి సమత కల్యాణ మండపంలో వివాహం అనంతరం నూతన జంట పడవపై వరుడి ఇంటికి వెళ్లారు. కాగా వరుడు ఇంటికి వైభవంగా బంధుమిత్రులతో వెళ్లాల్సి ఉండగా.. వరదలతో ప్రధాన రహదారిపై నడుంలోతు నీరు చేరడంతో పెళ్లింట ఇబ్బందులు తప్పలేదు.
Flood: వధూవరులకు వరద కష్టాలు... పడవలో 5కిలో మీటర్లు ప్రయాణం.. - ఏపీ తాజా వార్తలు
Flood Problems: కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంకలో నూతన వధూవరులకు వరద కష్టాలు ఎదురయ్యాయి. వివాహం అనంతరం నూతన జంట పడవపై వరుడు ఇంటికి వెళ్లారు. అయితే గోదావరి ఉద్ధృతికి గ్రామాలు నీట మునగడంతో వధూవరులు సుమారు 5కిలో మీటర్ల పడవ ప్రయాణం చేసి అప్పనరామునిలంక చేరుకున్నారు.
వరద కష్టాలు
Last Updated : Sep 16, 2022, 10:43 AM IST