Nagamalli Flowers: కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం రామేశ్వరంలోని శ్రీ కృతకృత్య రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో అరుదైన నాగమల్లి పుష్పాలు కనువిందు చేస్తున్నాయి. ఏడాదికోసారి మాత్రమే పూసే ఈ పూల మధ్యభాగంలో పడగ విప్పిన సర్పం వలే మధ్యలో శివలింగాకారం ఉంటుంది. ఇవి కొమ్మలకు పూయకుండా.. ఊడల్లాంటి కాండాలకు పూస్తూ సువాసనను వెదజల్లుతాయి. మహా శివుడికి ఏంతో ప్రీతికరమైన ఈ పూలను దర్శించడం పుణ్యమని భక్తులు విశ్వసిస్తున్నారు.
Nagamalli Flowers: రామేశ్వరంలో అరుదైన పుష్పాలు.. ఏడాదికోసారే..! - కోనసీమ జిల్లా తాజా వార్తలు
Nagamalli Flowers: సహజంగా పూలు రోజు పూస్తుంటాయి... కొన్ని అరుదైన పూలు మాత్రమే నెలకోసారి పూస్తాయి. కానీ ఇక్కడ ఉన్న చెట్టు మాత్రం ఏడాదికొకసారే పూస్తుంది. అదేెెంటి కొన్ని చెట్లు ఏడాదికోసారి పుష్పిస్తాయి కదా అనుకుంటున్నారా? మీరు ఊహించింది నిజమే.. కాకపోతే.. ఈ వృక్షం నాటిన పది సంవత్సరాల తర్వాత పూలు పూయడం విశేషం.. అంతేకాదు ఇవి ఎంతో సువాసనను వెదజల్లుతాయి.. అవే నాగమల్లి పుష్పాలు. ఇవి ఇప్పుడు మన రామేశ్వరంలో కనువిందు చేస్తున్నాయి.
ఆలయ ఆవరణలో పూర్వం నుంచి నాగలింగ వృక్షం ఉండేదని.. తుపానుల వల్ల చెట్టు కూలిపోగా దాని వేర్లతో ఈ చెట్టు వచ్చిందని అర్చకులు చెబుతున్నారు. ఈ వృక్షానికి పదేళ్లు వచ్చేవరకు ఎలాంటి పూలు పూయవని.. ఆ తర్వాత ఏడాదికోసారి పూలు పూస్తాయని చెబుతున్నారు. ఈ పూలు, అరుదుగా కాసే కాయలు కూడా ఆయుర్వేద మందుల తయారీలో వాడాతారన్నారు. శివలింగ వృక్షం శాస్త్రీయ నామం కౌరాపిట గియానెన్సిస్. ఇవి కేవలం ప్రపంచంలోని దక్షిణ అమెరికా, దక్షిణ భారతదేశంలో మాత్రమే కనిపిస్తాయని వృక్షశాస్త్ర నిపుణులు చెపుతున్నారు.
ఇవీ చదవండి:Nara Lokesh : సీఎం జగన్కు.. నారా లోకేశ్ 17 ప్రశ్నలు.. ఏంటంటే..!