రోడ్లు, డ్రైన్లు వేయలేకపోవడం వల్ల తన ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నానని.. కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన ఎంపీటీసీ సభ్యుడు రాజీనామాకు సిద్ధమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా మద్దతుదారుడుగా పోటీ చేసి బ్రహ్మానందం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని ఎంపీడీవో మహేష్ కు ఇవ్వగా... తనకు ఆ అధికారం లేదని ఆయన తిరస్కరించారు. వైకాపా నాయకులు బుజ్జగించడంతో తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు ఎంపీటీసీ బ్రహ్మానందం తెలిపారు.
రోడ్లు, డ్రైన్లు వేయలేకపోతున్నా.. రాజీనామా చేస్తున్నా.. నేతల బుజ్జగింపుతో ఉపసంహరణ - వైకాపా నేత రాజీనామా
ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు వేయలేకపోతున్నాననే మనస్థాపంతో .. కోనసీమ జిల్లాకు చెందిన ఎంపీటీసీ సభ్యుడు రాజీనామాకు సిద్దమైయ్యాడు. దీంతో రంగంలోకి దిగిన పై నాయకులు ఆయన్ని బుజ్జగించడంతో.. రాజీనామాను ఉపసంహరించుకున్నాడు.
mptc