Mother Complaint on Son: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దివంగత పులపర్తి నారాయణమూర్తి సతీమణి వెంకటలక్ష్మి తన కుమారుడిపై స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. అమలాపురంలోని ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆమె.. తన కుమారుడు రవి కుమార్ దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఈ నెల 7న తన కుమారుడు ఏడుగురు అనుచరులతో వచ్చి.. దౌర్జన్యంగా కారు, జీపు తీసుకెళ్లాడని తెలిపారు. తన భర్తను ఇబ్బంది పెట్టి ఆస్తులు రాయించుకున్నాడని తెలిపారు. తన కుమారుడి నుంచి ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని కోరారు.
కుమారుడిపై తల్లి ఫిర్యాదు.. ఎందుకోసమంటే..!
Mother Complaint on Son: కుమారుడు నుంచి తనకు ప్రాణహాని ఉందని ఓ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తతో బలవంతంగా ఆస్తులు రాయించుకోవడమే కాకుండా.. తాజాగా కారు లాక్కెళ్లడని ఆమె ఆరోపించింది. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో.. స్పందన కార్యక్రమంలో ఆమె ఫిర్యాదు చేసింది. బాధితురాలు సామాన్యురాలేమీ కాదు.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, దివంగత పులపర్తి నారాయణమూర్తి సతీమణి వెంకటలక్ష్మి.
మాజీ శాసనసభ్యులు పులపర్తి నారాయణమూర్తి భార్య వెంకటలక్ష్మి