Dowry harassment case: వరకట్న వేధింపుల కేసులో తమకు న్యాయం చేయాలని తల్లీకూతుళ్లు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టిన ఘటన డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామంలో జరిగింది. తన భర్త ఆత్మహత్యపై వాస్తవ నివేదికను బహిర్గతం చేయాలని భార్య సుజాత డిమాండ్ చేశారు. గత సంవత్సరం ద్రాక్షారామం పోలీస్ స్టేషన్లో అల్లుడు వరకట్నం పేరుతో వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసినట్లు సుజాత తెలిపారు. అయితే ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేయకుండా.. కాలయాపన చేస్తున్నారని తల్లి సుజాత, కూతురు నిషా మాలిని ఆరోపించారు.
న్యాయం చేయాలంటూ.. పీఎస్ ముందు తల్లీకూతుళ్ల నిరసన
Dowry harassment case: ఓ వైపు వరకట్న వేధింపులు.. మరోవైపు న్యాయం జరగలేదని మనస్తాపంతో ఇంటిపెద్ద ఆత్మహత్య చేసుకున్నాడని తల్లీకూతుళ్లు ద్రాక్షారామం పీఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. వరకట్న వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
తల్లీ కూతుళ్ళ నిరసన
నిందితులను అరెస్ట్ చేయకపోవడంతో తన తండ్రి తలపాగల శ్రీనివాసరావు మనస్తాపంతో గత ఏడాది ఆత్మహత్య చేసుకున్నారని,.. ఈ ఆత్మహత్యపై కూడా ద్రాక్షారామం పోలీసులు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని నిషా తెలిపారు. జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని తల్లీకూతుళ్లు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి: