MLA Rapaka Order to Volunteers: గ్రామ వాలంటీర్లపై ఇప్పటి వరకు మేం పెత్తనాలు చేయలేదు. ఇక ఏడాది కాలం వైసీపీకి ఉపయోగపడేలా నాయకుల ఇష్టానుసారం నడవాలి. వాలంటీర్లంటే సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఎంతో ఇష్టం. సంక్షేమ పథకాల అమలుపరంగా సచివాలయ కన్వీనర్లను కూడా కలుపుకొని వెళ్లండి. మీరు మాకు ఉపయోగపడండి. మీకు మేం దారి చూపిస్తాం అని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పేర్కొన్నారు.
'మాకు ఉపయోగపడండి.. మీకు మేం దారి చూపిస్తాం' - ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అప్డేట్స్
MLA Rapaka Order to Volunteers: గ్రామ వాలంటీర్లంటే ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసే వాళ్లు కాదు.. వైసీపీ ప్రభుత్వ కార్యకర్తలేనని మరోసారి రుజువైంది.. రాబోయే ఎన్నికల కోసం ఓ ఎమ్మెల్యే..ప్రతీ గ్రామ వాలంటీరు జగన్ ప్రభుత్వ అభివృద్ధి ఫలాలను ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు.. వైసీపీ కన్వీనర్‌గా పనిచేసిన వాళ్ల బాగోగులకు సీఎం అండగా ఉంటారని విజ్ఞప్తి చేశారు.

డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురులో వైసీపీ మండల శాఖ అధ్యక్షుడు భగవాన్ అధ్యక్షతన గ్రామ వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లకు శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రాపాక మాట్లాడారు. జనవరి 7న జరగనున్న కొత్త పింఛన్ల పంపిణీలో కన్వీనర్లకు వాలంటీర్లు సహకరించాలన్నారు. ఎన్నికలు వచ్చే సమయానికి వాలంటీర్లు విధుల్లో కొనసాగే అవకాశం ఉండనందున కన్వీనర్లతో సంక్షేమ కార్యక్రమాల అమలుకు కార్యాచరణ చేస్తామన్నారు. ఈ సమాశానికి హాజరుకాని వాలంటీర్లకు నోటీసులిచ్చి తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఇవీ చదవండి: