ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమలాపురం ఘటనలో ఎవరున్నా ఉపేక్షించం: మంత్రి విశ్వరూప్

Minister Vishwaroop: నిన్నటి ర్యాలీలోకి సంఘ విద్రోహశక్తులు చొరబడ్డాయని మంత్రి విశ్వరూప్​ అన్నారు. ఈ ఘటనలో తెదేపా, జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారని ఆరోపించారు. నిన్న ఆందోళనకారులు నిప్పంటించిన తన ఇంటిని మంత్రి విశ్వరూప్​ పరిశీలించారు.

Minister Vishwaroop
మంత్రి విశ్వరూప్

By

Published : May 25, 2022, 2:51 PM IST

Updated : May 25, 2022, 5:40 PM IST

Minister Vishwaroop: నిన్నటి ఘటనలో దహనమైన తన ఇంటిని మంత్రి విశ్వరూప్​ పరిశీలించారు. ర్యాలీకి పిలుపునిచ్చిన కోనసీమ సాధన సమితి బాధ్యత తీసుకోవాలని విశ్వరూప్‌ అన్నారు. కొంతమంది సంఘ విద్రోహశక్తులు ర్యాలీలోకి చొరబడ్డారని ఆరోపించారు. అమలాపురం ప్రజలకు ఎలాంటి తప్పుడు ఆలోచనలు లేవన్నారు. ఉద్యమం ముసుగులో కొంతమంది రౌడీషీటర్లు చొరబడ్డారని ఆరోపించారు. ముందుగా అనుకున్న ప్రకారమే తన ఇంటిపై దాడి చేశారని తెలిపారు. ఈ ఘటనలో తెదేపా, జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారన్నారు. అయితే ఈ ఘటనలో వైకాపాతో పాటు ఎవరున్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

తమ కుటుంబసభ్యులంతా క్షేమంగా ఉన్నామని తెలిపారు. అమలాపురం ప్రజలంతా సంయమనం పాటించాలని కోరారు. అంబేడ్కర్‌ పేరు పెట్టాలని అన్ని పార్టీలు కోరాయని మంత్రి విశ్వరూప్‌ అన్నారు.

మంత్రి విశ్వరూప్

ఇవీ చదవండి:

Last Updated : May 25, 2022, 5:40 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details