Class differences in YSRCP: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అధికార వైఎస్సార్సీపీలో వర్గ విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. రామచంద్రాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ కోలమూరి శివాజీపై మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రధాన అనుచరుడు ఉదయకాంత్ దాడి చేశాడు. మంత్రి వేణుతో కలిసి పట్టణంలోని ముచ్చుమిల్లిలో జగనన్న సురక్ష కార్యక్రమంలో శివాజీ పాల్గొన్నారు. నిన్న ఎంపీ బోస్ వర్గీయులు నిర్వహించిన సమావేశానికి ఎందుకు వెళ్లావంటూ ఆగ్రహంతో ఊగిపోయిన ఉదయ్ కాంత్.. శివాజీ ముఖంపై కొట్టాడు. దీంతో మంత్రి వేణు ఉదయ్‌ను వారించారు. అనంతరం శివాజీ అవమాన భారంతో చీమల మందు తాగడంతో ఆయన్ను రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంత్రి వేణు కుమారుడు అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నాడని, వచ్చే ఎన్నికల్లో బోస్ కుటుంబానికి టిక్కెట్ ఇవ్వాలంటూ నిన్న ద్రాక్షారామం సమీపంలోని వెంకటాయపాలెంలో ఎంపీ బోస్ వర్గీయులు సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో విజయానికి సహకరించిన తమపైనే కేసులు బనాయిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఒకవేళ మంత్రికి టిక్కెట్ ఇస్తే ఓడించి తీరుతామని తేల్చి చెప్పారు. దీంతో నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా మంత్రి వేణు సమక్షంలోనే మున్సిపల్ వైస్ చైర్మన్‌ను కొట్టడం సంచలనంగా మారింది.
Ramachandrapuram Politics: మంత్రి ఎదుటే మున్సిపల్ వైస్ చైర్మన్‌పై దాడి.. శివాజీ ఆత్మహత్యాయత్నం
ఆత్మహత్యాయత్నం చేసిన శివాజీ
15:06 July 17
కోనసీమ జిల్లాలో వైసీపీలో కొనసాగుతున్న వర్గ పోరు
Last Updated : Jul 17, 2023, 3:47 PM IST