బైక్‌ను ఢీకొట్టిన పాల వ్యాను, అక్కడికక్కడే ముగ్గురు మృతి - బైక్‌ను ఢీకొట్టిన పాల వ్యాను
06:59 June 17
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. రావులపాలెం మండలం కొమర్రాజులంకకు చెందిన అప్పన నాగేశ్వరరావు అనే వ్యక్తి.. మరో మహిళతో కలిసి కొత్తపేటలో ఉంటున్నాడు. ఇంటికి రాకపోవడంతో నాగేశ్వరరావు తల్లి అప్పన్న సత్యవతి(55), భార్య వెంకటలక్ష్మి(40), కొడుకు మహేష్(20)లు ముగ్గురు ద్విచక్రవాహనంపై శుక్రవారం అర్ధరాత్రి సమయంలో కొత్తపేట వెళ్లి నాగేశ్వరరావుతో ఘర్షణ పడ్డారు. అక్కడినుండి ముగ్గురు ద్విచక్ర వాహనంపై తిరిగి కొమర్రాజు లంక వస్తుండగా.. కొత్తపేట మండలం మందపల్లి వద్దకు వచ్చేసరికి రావులపాలెం వైపు నుండి కొత్తపేట వైపు వెళ్తున్న పాల వ్యాన్ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మృతదేహాలను కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: