Buses collide head-on in AP: రహదారిపై ఉన్న గుంతలు తప్పించబోయి.. రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటన డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్వారపూడిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... కాకినాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, రాజమండ్రి నుంచి కాకినాడ వైపు వెళ్తుంది. వేమగిరి సామర్లకోట కెనాల్ రహదారిపై ద్వారపూడి శివారు పెట్రోల్ బంకు దాటేసరికి రోడ్డు పక్కన ఉన్న గుంతను తప్పించబోయిన బస్సు.. రోడ్డు మధ్యలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎదురుగా కాకినాడ వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న రాజమండ్రి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్లు, కండక్టర్లకు, ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన ప్రయాణికులను అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో రాజమండ్రి డిపో బస్సులో 45 మంది.. కాకినాడ డిపోకు చెందిన బస్సులో 65 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటన స్థలాన్ని పోలీసులు, రాజమండ్రి డిపో మేనేజర్ షేక్ షబ్నం పరిశీలించారు.
Two buses collide: గుంతలు తప్పించబోయి ఢీకొన్న రెండు ఆర్టీసీ బస్సులు.. తప్పిన పెను ప్రమాదం
Buses collide head-on:అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గుంతను తప్పించబోయి రెండు బస్సులు ఢీకొన్న ఘటన నెలకొంది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండల కేంద్రంలో చోటు చేసుకున్న మరో ఘటనలో ఓ కంపెనీకి చెందిన రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో పదిమంది మహిళా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో మేనేజర్ షేక్ షబ్నం, అసిస్టెంట్ డిపో మేనేజర్ అజయ్ కుమార్తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. అనపర్తికి చెందిన పాణింగపల్లి భీమరాజు(64) తీవ్రంగా గాయపడటంతో ప్రాథమిక చికిత్స అనంతరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నలుగురు క్షతగాత్రులు ఆసుపత్రికి రాగా ఒకరు ప్రాథమిక చికిత్స అనంతరం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లిపోయారు. ఇద్దరికీ స్వల్ప గాయాలు కాగా... ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి.
CCTV Video: రెండు బస్సులు ఢీ- క్షణాల్లోనే అంతా తారుమారు!
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండల కేంద్రంలో రెండుబ్రాండిక్స్ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో పది మంది మహిళా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ ఈ జెడ్ లోని బ్రాండిక్స్ దుస్తుల తయారీ పరిశ్రమలు పనిచేస్తున్న కార్మికులు బి షిఫ్ట్ ముగించుకొని ఇంటికి చేరుకోవడానికి బ్రాండిక్స్ బస్సులు ఎక్కారు. ముందు వెళ్తున్న బ్రాండ్స్ వన్ బస్సును బ్రాండిక్స్ 2 బస్సు వెనుక భాగం ఢీ కొట్టింది. ఢీ కొట్టిన బస్సులో ప్రయాణిస్తున్న పది మంది మహిళా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన కంపెనీ యాజమాన్యం వీరిని హుటాహుటిన అనకాపల్లి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బ్రాండిక్స్ బస్సులో అతివేగంగా నడపడం వల్ల తరచూ ప్రమాదాలు గురవుతున్నామని స్థానికులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఢీకొట్టిన బస్సు నుజ్జునుజ్జయింది. గాయపడిన వారిలో కొంతమందిని అచ్యుతాపురం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మరి కొంతమందిని అనకాపల్లి తరలించారు.