Padayatra : అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని సర్పంచులు పాదయాత్ర చేపట్టారు. పంచాయతీకి నిధులు ఇవ్వాలి కలెక్టరేట్ వరకు ఈ పాదయాత్ర చేపట్టారు. మలికిపురం మండలానికి చెందిన సర్పంచులు అమలాపురం కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు. 35 కిలోమీటర్ల దూరం చేపట్టిన ఈ యాత్ర.. తమ గోడు కలెక్టర్కు వివరించేందుకే పాదయాత్ర చేపట్టామని సర్పంచులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా పంచాయతీలకు వచ్చే ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించి గ్రామాల అభివృద్ధికి ఆన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలకు మళ్లిస్తోందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నిధులను విడుదల చేయకపోతే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వ వైఖరికి నిరసనగా 35 కిమీ పాదయాత్ర చేసిన కోనసీమ సర్పంచులు - నవరత్నాలు
Padayatra : కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలయ్యే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లీస్తోంది. దీంతో గ్రామాల సర్పంచులు నిరసనల భాట పడుతున్నారు. తాజాగా పంచాయతీలకు నిధులను విడుదల చేయాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని సర్పంచులు పాదయాత్ర చేపట్టారు.
సర్పంచుల పాదయాత్ర
"సర్పంచులు రొడ్డెక్కి పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే.. దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి. బ్రిటిషు కాలంలో చేసినట్లు చట్టాలు చేసి రాత్రికి రాత్రి అమలు పరుస్తున్నారు. మా గోడు ఏ ఒక్క అధికారి పట్టించుకోవటం లేదు." -సర్పంచులు
ఇవీ చదవండి: