ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 8, 2022, 8:16 PM IST

ETV Bharat / state

రైతులు పంట విరామం ఆలోచన విరమించుకోవాలి: కలెక్టర్

Konaseema Collector on Crop Holiday: కోనసీమలో పంట విరామం ఆలోచనను విరమించుకోవాలని రైతులను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా కోరారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రేపటిలోగా రైతులందరికీ డబ్బుల చెల్లింపు జరుగుతుందన్నారు.

Konaseema Collector on Crop Holiday
Konaseema Collector on Crop Holiday

collector Himanshu Shukla on crop holiday in Konaseema: కోనసీమ రైతులు పంట విరామం ఆలోచనను విరమించుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా విజ్ఞప్తి చేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రేపటిలోగా రైతులందరికీ డబ్బుల చెల్లింపు జరుగుతుందని ఆయన భరోసా ఇచ్చారు. అల్లవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, ఐ. పోలవరం మండలాల్లో కలెక్టర్​ పర్యటించారు. స్థానికంగా మురుగు కాలువలను పరిశీలించిన అనంతరం రైతులతో మాట్లాడారు.

ఐ.పోలవరం మండలం రైతులంతా ఖరీఫ్ సీజన్​కు పంట విరామం(క్రాప్ హాలీడే) ప్రకటిస్తున్నామని పేర్కొంటూ.. తహసీల్దార్​కు మంగళవారం వినతి పత్రం అందజేశారు. మండల అధికారుల ద్వారా సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్..​ ఇవాళ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఐ. పోలవరం మండలం పరిధిలోని గ్రామంలో స్థానిక రైతులు ఎదుర్కొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో విక్రయించిన ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించకపోవడం, ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ, పంట కాలువల నిర్వహణ.. వంటి విషయాలను కలెక్టర్​కు వివరించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details