Virasam Aikya Vedika Representatives Visited Kodi Kathi Case Accused Family:కోడి కత్తి కేసు నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ కుటుంబాన్ని విరసం ఐక్యవేదిక బృందం పరామర్శించింది. నిందితుడి కుటుంబం దయనీయ స్థితిలో ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో చూడాలనుకుని హత్యాయత్నం చేసిన వ్యక్తిని జైల్లో మగ్గేలా చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ కుటుంబానికి దళిత సంఘాలు అండగా ఉంటాయని.. న్యాయం జరిగే వరకు శ్రీనివాస్ కుటుంబం వెంటే ఉంటామని భరోసా కల్పించారు.
శ్రీనివాస్‌పై తీవ్రమైన నేరారోపణ చేసి జైల్లో పెట్టారన్న విరసం నేతలు.. సీఎం జగన్‌కు (CM Jagan) కోడి కత్తి దాడి వల్ల గాయమైందని చెప్తూ.. కేసుపై అభ్యంతరం చెప్పటం లేదని అన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఛార్జ్‌షీట్ వేశారని.. కోర్టులో కేసు నడిచిందని కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసిందని గుర్తు చేశారు. కేసు చివరకి ఎన్ఐఏ చేతికి వెళ్లటంతో కటకటాల్లోకి నెట్టారన్నారు.
Kodi katti case: జైలులోనే నిరాహార దీక్ష చేస్తానంటున్న కోడికత్తి శీను.. ఎందుకో తెలుసా?
శ్రీనివాస్‌ను జైలుకు పంపి ఈ నెల 19నాటికి నాలుగున్నర సంవత్సరాలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు దాదాపు ఐదు సంవత్సరాలు రిమాండ్‌లో ఉండటం సర్వసాధారణ విషయం కాదని పేర్కొన్నారు. శ్రీనివాస్ తల్లి చెప్పినట్లుగా.. హత్యలు చేసిన నాయకులు బయట తిరుగుతూ.. రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా ముఖ్యమంత్రితోనే చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారని దుయ్యబట్టారు.
కోడి కత్తి కేసు నిందితుడు మాత్రం.. తాను హత్య చేయాలనే ప్రయత్నం కాదని, హత్య చేసేంత కోపం లేదని.. అంతటి బలవంతుడ్ని కూడా కాదని మొరపెట్టుకున్నారని అన్నారు. రాజకీయంగా కలసి వస్తుందనే అలా చేశానని నెత్తి నోరు కొట్టుకున్నా వినలేదని, ఇదే మాట కోర్టులో కూడా విన్నవించాడని గుర్తు చేశారు. దీనిని కోర్టు అయినా విశ్వసిస్తుంది కానీ, సీఎంకు మాత్రం కనికరం లేదని మండిపడ్డారు.