ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా కనుమ వేడుకలు - Kanuma news

Kanuma celebrated with traditional fervour: కనుమ పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అన్నదాతలు పశువులకు ప్రత్యేక పూజలు చేసారు. గంగిరెద్దులాటలు, కోలాటాలు, కూచిపూడి నృత్యాలతో ఎక్కడ చూసినా సందడి వాతవరణం నెలకొంది. పలు చోట్ల ప్రభలను ఏర్పాటు చేసి వాటి ముందు డప్పు వాయిద్యాలు మోగిస్తూ, బాణసంచా కాలుస్తూ యువత సందడి చేశారు.

Kanuma celebrated with traditional fervour
Kanuma celebrated with traditional fervour

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 16, 2024, 8:10 PM IST

Kanuma celebrated with traditional fervour: సంక్రాంతి సంబరాలు జోరుగా సాగాయి. పశువుల పండుగగా పిలుచుకునే కనుమ నాడు, రైతులు మూగజీవాలకు పూజలు నిర్వహించారు. కోనసీమ జిల్లాల్లో ప్రభల ఊరేగింపు ఆకట్టుకుంది. గంగిరెద్దుల ఆటలు, కోలాటాలు, సాంస్కృతిక నృత్యాలతో ఊరూ-వాడా సందడి నెలకొంది.

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ:బాపట్ల జిల్లా చీరాలలోని మహాలక్ష్మి దేవాలయంలో రమానంద స్వామి గోవులకు పూజలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయకుడి ఆలయం వద్ద నుంచి పాతపేట వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ భోగిమంటలు వేశారు. గంగిరెద్దులాటలు, కోలాటాలు, కూచిపూడి నృత్యాలతో సందడి చేశారు. జగ్గయ్యపేటలో తెలుగుదేశం నేత శ్రీరామ తాతయ్య ఆధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ముగ్గుల పోటీలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, కర్రసాము నిర్వహించారు. శ్రీరామ తాతయ్య కర్రసాముతో అలరించారు.

లెటర్​హెడ్​ తెచ్చిన వారికి మందు బాటిల్, కోడి - వాసుపల్లి విద్యాసంస్థ భవనంలో పంపిణీ


నెమలి ఫించాలతో అందంగా అలంకరించిన ప్రభలు: కోనసీమలో ప్రభలను వైభవంగా ఊరేగిస్తూ తీర్థ ప్రదేశాలకు తరలించారు. జిల్లావ్యాప్తంగా 120 గ్రామాల నుంచి సుమారు 500 ప్రభలను తయారు చేసి, మేళతాళాలు మధ్య తీర్థప్రదేశాలకు తీసుకెళ్లారు. అంబాజీపేట మండలంలోని వాకలగరువు, తొండవరం, గున్నేపల్లి, అగ్రహారంలో ప్రభలను స్థానిక రావిచెట్టు కూడలి వద్దకు చేర్చారు. నెమలి ఫించాలతో అందంగా అలంకరించిన ప్రభలను, శివనామస్మరణ చేస్తూ యువకులు మోసుకొచ్చారు. కొత్తపేట మండలం అవిడిలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఫొటోలతో తయారు చేసిన ప్రభలను ఊరేగించారు. ప్రభల ముందు డప్పు వాయిద్యాలు మోగిస్తూ, బాణసంచా కాలుస్తూ యువత సందడి చేశారు.


గోశాలలో గోవులకు పూజలు: కనుమ సందర్భంగా సింహాద్రి అప్పన్న స్వామివారి కృష్ణాపురం గోశాలలో గోవులకు పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కనుమ సందర్భంగా గోవుల పండుగ ఘనంగా జరిగింది. నరసన్నపేటలోని దేశివానిపేట, వీరన్ నాయుడు కాలనీ తదితర ప్రాంతాల్లో గోపూజ ఘనంగా నిర్వహించారు. గోమాతలకు ప్రత్యేకంగా పూజలు చేసి పాయసం ప్రసాదంగా చెల్లించారు.

తిరుపతిలో జోరుగా జల్లికట్టు - పలకలు చేజిక్కించుకునేందుకు యువకుల సాహసం


కుందేళ్లను పట్టుకోవడానికి పోటీపడ్డ యవత: కనుమను పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలోని గోశాలలోని గోవులకు నూతన వస్ర్తాలు కప్పి పూజలు చేశారు. శ్రీసత్యసాయి జిల్లా కుటాగుళ్లలో పులిపార వేట ఉత్సవం ఉత్సాహంగా సాగింది. ముందుగా చెన్నకేశవ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పులిపార వేటలో కుందేళ్లను పట్టుకోవడానికి యువత పోటీ పడ్డారు. మొక్కులు తీర్చుకోవడంలో భాగంగా స్వామి వద్ద పూజలు నిర్వహించిన తరువాత కుందేళ్లను వదిలారు. వాటిని పట్టుకోవడానికి యువకులు ఎగబడ్డారు. ఒకరితో మరొకరు పోటీపడుతూ యువత కేరింతలతో ఆ ప్రాంతం సందడిగా మారింది.


ఘనంగా సంక్రాంతి సంబరాలు - పండగ శోభకు వన్నె తెచ్చిన సాంస్కృతిక కార్యక్రమాలు

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా కనుమ వేడుకలు

ABOUT THE AUTHOR

...view details